మిరపలో కొత్తరకం చీడ
● ఐసీఏఆర్–నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి
● నియంత్రణపై అవగాహన సదస్సు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): త్రిప్స్ పార్విస్పినస్‌గా పిలిచే చీడ పురుగు ఆగ్నేయాసియా మిరపకాయలలో కొత్తగా పుట్టుకొస్తోందని ఐసీఏఆర్–జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. రాజమండ్రిలోని ఐసీఏఆర్–నిర్కా సమావేశ మందిరంలో బుధవారం మిరప పంటలో సస్యరక్షణపై కార్యక్రమం నిర్వహించారు. శేషుమాధవ్ మాట్లాడుతూ మిరప ఉత్పత్తిలో 30–50% నష్టపరిచే సామర్థ్యాన్ని ఈ చీడపురుగు కలిగి ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఐసీఏఆర్–నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ ఎస్‌ఎన్ సుశీల్, పంట రక్షణ విభాగం అధిపతి డాక్టర్ కె.రాజశేఖరరావు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నిర్వహించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ ఎ.కందన్, డాక్టర్ ఆర్‌ఆర్ రచన ఈ చీడను నియంత్రించే పద్ధతులపై చర్చించారు. డాక్టర్ టీవీకే సింగ్, డాక్టర్ వి.శ్రీధర్, డాక్టర్ యు.శ్రీధర్ వంటి శాస్త్రవేత్తలు ఈ తెగులు నివారణకు విలువైన సూచనలిచ్చారని నిర్వహణ కార్యదర్శి డాక్టర్ శైలజ జయశేఖరన్ తెలిపారు.


