కాపురానికి రావడం లేదని కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

కాపురానికి రావడం లేదని కత్తితో దాడి

Nov 5 2025 8:07 AM | Updated on Nov 5 2025 8:07 AM

కాపుర

కాపురానికి రావడం లేదని కత్తితో దాడి

అత్త, వదినలకు గాయాలు అత్త పరిస్థితి విషమం

ఏలేశ్వరం: భార్య కాపురానికి రావడం లేదనే కోపంతో విచక్షణ మరచిన ఓ అల్లుడు తన అత్తపై, అడ్డు వచ్చిన వదినపై కత్తితో దాడి చేసిన సంఘటన మండలంలోని తిరుమాలి గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రామకుర్తి అప్పలరాజు(45)కు ఇద్దరు కుమార్తెలు. భర్త సూరిబాబు చనిపోవడంతో తిరుపతిలో కూలీపనులు చేసుకుంటూ అప్పలరాజు జీవిస్తోంది. పెద్ద కుమార్తె నాగదుర్గాసాయిని అదే గ్రామానికి చెందిన కేశనశెట్టి మణికంఠస్వామికి, రెండో కుమార్తె దుర్గాదేవిని రాయవరం మండలం వెదురుపాకకు చెందిన పెంటపాటి హరిబాబుకు ఇచ్చి వివాహాలు చేసింది. దుర్గాదేవికి, హరిబాబుకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో, వారిద్దరూ ఏడాది క్రితం నుంచి విడివిడిగా ఉంటున్నారు. దుర్గాదేవి వేరే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న హరిబాబు అదను కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో పింఛన్‌ తీసుకునేందుకు అప్పలరాజు తిరుమాలిలోని తన కుమార్తె నాగదుర్గాసాయి ఇంటికి ఈ నెల 1న వచ్చింది. అప్పటి నుంచీ అక్కడే ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం అక్కడ పొంచి ఉన్న హరిబాబు అత్త అప్పలరాజు మెడపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన వదిన నాగదుర్గాసాయిపై కూడా దాడి చేశాడు. దీంతో, నాగదుర్గాసాయి చేతికి గాయమైంది. గమనించిన చుట్టుపక్కలవారు కేకలు వేయడంతో హరిబాబు పరుగులు తీశాడు. తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లనిద్దరినీ తొలుత ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై రామలింగేశ్వరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తిరుమాలి గ్రామంలో ఈ సంఘటన తీవ్ర విషాదం నింపింది.

గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

అంబాజీపేట: గడ్డి మందు తాగిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై కె.చిరంజీవి తెలిపారు. అంబాపేటకు చెందిన కాసు శ్రీనివాసరావు (60) ఈ నెల 3వ తేదీన పొలం వెళ్లి గడ్డి మందు తాగాడన్నారు. అనంతరం తన అల్లుడు శ్యామ్‌సుందర్‌కు గడ్డి మందు సేవించిన సమాచారాన్ని ఫోన్‌లో తెలియపర్చాడన్నారు. అతని బంధువుల సాయంతో అమలాపురం ఆస్పత్రిలో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం కాకినాడ అపోలో ఆస్పత్రికి తరలించారన్నారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు.

కాపురానికి రావడం లేదని కత్తితో దాడి 1
1/3

కాపురానికి రావడం లేదని కత్తితో దాడి

కాపురానికి రావడం లేదని కత్తితో దాడి 2
2/3

కాపురానికి రావడం లేదని కత్తితో దాడి

కాపురానికి రావడం లేదని కత్తితో దాడి 3
3/3

కాపురానికి రావడం లేదని కత్తితో దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement