పారా స్విమ్మింగ్‌లో సచివాలయ ఉద్యోగికి రెండు పతకాలు
బాలాజీచెరువు: ఇటీవల ఏలూరులో జరిగిన 7వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పారా స్విమ్మింగ్ చాంపియన్ షిప్ – 2025లో కాకినాడ సచివాలయానికి చెందిన ఉద్యోగి లంక నాగేశ్వరరావు ప్రతిభ కనబరిచి రెండు పతకాలు సాధించారు. కాకినాడ డ్రైఫిష్ మార్కెట్ సచివాలయంలో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న నాగేశ్వరరావు, ఈ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభతో మెడల్స్ సాధించారు. మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఇన్‌చార్జ్ కమిషనర్ కె.టి.సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావులను నాగేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలసి తాను సాధించిన పతకాలను ప్రదర్శించారు. వారు నాగేశ్వరరావును అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


