హోరాహోరీగా చదరంగం పోటీలు
అమలాపురం రూరల్: కోనసీమ డిస్ట్రిక్, ఆంధ్రా చెస్ అసోసియేసషన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో అమలాపురం మండలం కామనగరువులో ఢిల్లీ పబ్లిక్ స్కూలో కోనసీమ డిస్ట్రిక్ట్ ఓపెన్ చదరంగ పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 250 మందికి పైగా విద్యార్థులు తరలివచ్చారు.
బి.నానిబాబు ప్రఽథమ స్థానం సాధించి రూ.4,000 నగదు బహుమతి, డి. సాత్విక్ ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుని రూ.3,000 గెలుచుకున్నాడు. టి.సాయి వెంకటేష్ తృతీయ స్థానం సాధించి రూ.2000 గెలుపొందాడు. ఏడు స్థానాల్లో విజేతలకు నగదు బహుమతులను డీపీఎస్ స్కూల్ చైర్మన్ నంద్యాల నాయుడు, డైరెక్టర్ నంద్యాల మను విహార్ సోమవారం అందజేశారు. ఈ పోటీల్లో అండర్ 9, 11, 13, 15 విభాగాల్లో మొదటి ఐదుస్థానాలకు సీ్త్ర, పురుషులకు విడివిడిగా నగదు బహుమతి, ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. విజేతలను చెస్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ తాడి వెంకట సురేష్‌కుమార్, స్కూల్ ప్రిన్సిపాల్ దేవి దీక్షిత్, చీఫ్ ఆర్బిటర్ జీవీ కుమార్, టోర్నమెంట్ డైరెక్ట్ శ్రీనుబాబు అభినందించారు.
అయినవారి కోసం
ఐవీఆర్‌ఎస్
సాక్షి, అమలాపురం: పదవి మనోడికివ్వాలి... కాని పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్టు కనిపించాలి అనే సూత్రాన్ని అధికార టీడీపీ బాగా ఒంటబట్టించుకుంది. ఇప్పటి వరకు ఎంపీ.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు మాత్రమే వినియోగించే ఇంట్రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్‌ఎస్)ను టీడీపీ అధిష్టానం చివరకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు సైతం వినియోగిస్తోంది. కోనసీమ జిల్లాలో మొత్తం తొమ్మిది మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకుగాను ఇప్పటి వరకు నగరం, ఆలమూరు, మండపేట ఏఎంసీలకు చైర్మన్‌లను ఎంపిక చేశారు. ఇంకా కొత్తపేట, రామచంద్రపురం, అమలాపురం, తాటిపాక, అంబాజీపేట, ముమ్మిడివరం మార్కెట్ కమిటీలకు చైర్మన్లను, పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. వీటిలో అమలాపురం, అంబాజీపేట ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ రెండు మార్కెట్ కమిటీలను తమకు కేటాయించాలని జనసేన పార్టీ నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నా ఆ రెండు చైర్మన్ పదవులను పొత్తులో టీడీపీ తమకు వచ్చేలా చేసుకుంది. అంతటితో సరిపోదన్నట్టుగా కీలకమైన అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తమ పార్టీకి మొదటి నుంచి దన్నుగా ఉన్న పార్టీకి చెందిన కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చేందుకు పావులు కదిపింది. ఇందుకు ఐవీఆర్‌ఎస్‌ను తెరపైకి తెచ్చింది.
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల నిర్ణయించేందుకు చంద్రబాబు తెచ్చిన ఈ విధానంలో ఫోన్ ద్వారా పార్టీ కార్యకర్తలు, నాయకులతోపాటు ఎంపికచేసిన ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకుంటోంది. కాని అంబాజీపేట ఏఎంసీ చైర్మన్ పదవికి మాత్రం పార్టీ పెద్దలు నిర్ణయించిన అయినవిల్లికి చెందిన చిట్టూరి శ్రీనివాస్ ఒక్క పేరు మీదనే అభిప్రాయ సేకరణ చేయడం విశేషం. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కోటరీకి చెందిన శ్రీనివాస్‌కు పదవి ఇవ్వడం పెద్ద విషయం కాదు. కాని ఇందుకు ఐవీఆర్‌ఎస్ అంటూ హడావుడి చేయడం విడ్డూరంగా ఉందని తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. అమలాపురం ఏఎంసీకి సహితం ఇదే విధానాన్ని అవలంబించారు. ఇక్కడ పోటీ ఎక్కువగా ఉన్నా జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అధికార జయ వెంకటలక్ష్మికి ఈ పదవి ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు భావిస్తున్నారు. ఇందుకు అధిష్టానం నుంచి అనుమతి పొందారు. ఈ పదవి సైతం జయ వెంకటలక్ష్మి ఒక్క పేరు మీదనే ఐవీఆర్‌ఎస్ చేయడం గమనార్హం.
● టీడీపీ అధినాయకత్వం వింత పోకడ
● రెండు మార్కెట్ యార్డులకు
చైర్మన్‌ల ఎంపికకు ఒక్కొక్క పేరుతో ఐవీఆర్‌ఎస్
● విడ్డూరంగా ఉందంటున్న
కార్యకర్తలు
హోరాహోరీగా చదరంగం పోటీలు


