రాసలీలల సీడీ కేసు: అవును.. ఆమె తెలుసు..!

సాక్షి, బెంగళూరు: రాసలీలల సీడీ కేసులో ఇన్నాళ్లూ బాధిత యువతి తనకు పరిచయం లేదని చెప్పిన మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి ఆమె తెలుసని అంగీకరించినట్లు సమాచారం. ఆయన సిట్ విచారణలో యువతితో పరిచయం ఉందని, ఇద్దరం ఏకాంతంగా గడపడానికి మాట్లాడుకున్నట్లు చెప్పినట్లు తెలిసింది. అయితే ఆమె వీడియోలు తీసి బహిర్గతం చేసిందని వాపోయారు. యువతి తరఫు న్యాయవాది జగదీశ్‌కుమార్ దీనిపై మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితుడైన జార్కిహొళిని అరెస్టు చేయాలని కోరారు.