ఇటీవలే పెళ్లి, అంతలోనే ఆత్మహత్య 

Worker Commits Suicide After Suffering From Illness By Drinking Pesticide - Sakshi

సాక్షి, హోసూరు: ఇటీవలే పెళ్లయింది, కానీ అనారోగ్యంతో బాధపడుతూ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్న ఘటన బాగలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు హోసూరు సమీపంలోని కూస్తనపల్లి గ్రామానికి చెందిన అశోక్‌ (38). ఇతనికి గత ఏడు నెలల క్రితం పెళ్లి జరిగింది.

కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన అశోక్‌ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన బంధువులు అతన్ని చికిత్స కోసం హోసూరులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మరణించాడు. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.  

(చదవండి: ఆస్పత్రికి వెళ్తున్న దంపతులను వేధించిన ట్రాఫిక్ పోలీసులు.. సృహతప్పి పడిపోయిన భార్య..)

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top