
అరెస్టయిన రూప
సాక్షి, యశవంతపుర: భర్తను హత్య చేయడానికి పథకం వేసిన భార్య రూపతో పాటు మరో ఇద్దరిని మాదనాయకనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రూప, గిరీశ్‌లకు ఆరేళ్ల క్రితం పెళ్లయింది. ఇటీవల రూప ఒక ఫ్యాక్టరీలో పనికి చేరింది. అక్కడ కుమార్ జైన్ అనే వ్యక్తితో పరిచయమై అక్రమ సంబంధానికి దారితీసింది. రూప సంగతి తెలిసిన భర్త పనికి వెళ్లవద్దంటూ కట్టడి చేశాడు.
దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని రూప, ప్రియుడు రూ.15 లక్షలకు సుపారి ఇచ్చారు. నలుగురు దుండగులు మాదనాయకనహళ్లిలో మంకీ క్యాప్ ధరించి తిరుగుతుండగా పోలీసులు అనుమానం వచ్చి ప్రశ్నించగా సుపారి విషయం బయటపడింది. రూప, కుమార్‌జైన్ మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.