West Zone Police Raids On Massage Centres In Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: స్పా సెంటర్లలో వ్యభిచారం కోసం గదులు.. ఎలాంటి పర్మిషన్లూ లేనివి కూడా..

Jul 15 2023 2:52 PM | Updated on Jul 15 2023 3:47 PM

West Zone Police Raids on Massage Centres in Hyderabad - Sakshi

పోలీసులు దాడులు చేసిన ఓ స్పా సెంటర్‌

జీహెచ్‌ఎంసీ లైసెన్లు లేకుండా.. పైగా మహిళలతో క్రాస్‌ మసాజ్‌ చేయిస్తూ.. 

క్రైమ్‌: వ్యభిచార కూపాలుగా మారిన స్పా సెంటర్ల గుట్టును హైదరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం వెస్ట్‌ జోన్‌ పరిధిలో జరిగిన టాస్క్‌ ఫోర్స్‌ దాడుల్లో పలు మసాజ్‌ సెంటర్లు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

అనుమతులు లేకుండా నడుస్తున్న స్పా సెంటర్లనే కాకుండా.. వాటిల్లో వ్యభిచారం కోసం ప్రత్యేక గదుల్ని ఏర్పాటు చేయడాన్ని గుర్తించారు. దాదాపు 10 మసాజ్‌ పార్లర్ల మీద దాడులు చేసి..  34 మంది నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

ఎస్‌ఆర్‌ నగర్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ స్టేషన్ల పరిధిలో లైసెన్లు లేకుండా నిర్వహిస్తున్నారని సమాచారం మీద దాడులు చేశారు. జీహెచ్‌ఎంసీ లైసెన్స్‌లతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్‌లు, ప్రొఫెషనల్‌ థెరపిస్ట్‌లు లేకపోవడం, కస్టమర్ల ఎంట్రీ రిజిస్ట్రర్‌ సైతం లేవని తేలింది. అలాగే.. మార్గదర్శకాలు ఫాలో కాకుండా మహిళలతో క్రాస్‌ మసాజ్‌ చేస్తూ చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నట్లు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement