Gold Smuggling: అంత బంగారాన్ని నోట్లో ఎలా దాచర్రా సామి..!

Two Uzbek Nationals Hide Gold In Mouth - Sakshi

దేశంలో బంగారం స్మగ్లింగ్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎంత వీలైతే అంత దేశాల సరిహద్దులు దాటించేందుకు స‍్మగ్లర్లు కొత్త కొత్త పద్దతుల్ని అన్వేషిస్తున్నారు. సినిమా స్టైల్లో బంగారాన్ని తరలిస్తున్నారు.కొన్ని సార్లు అధికారులకు అడ్డంగా దొరికేస్తున్నారు. తాజాగా ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఇద్దరు స్మగ‍్లర్లు విచిత్రంగా బంగారాన్ని తరలిస్తూ ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు.  

సినిమాల్లో బంగారాన్ని కడుపులో, లేదంటే తలపై విగ్గులో పెట్టుకొన్ని స్మగ్లింగ్‌ చేసే సన‍్నివేశాల్ని చూసే ఉంటాం. ఆ సన్నివేశాలు ఈ ఉబ్బెకిస్తాన్‌ గోల్డ్‌ స్మగ్లర్లు బాగా నచ్చినట్లన్నాయి. అందుకే తెలివిగా బంగారాన్ని నోట్లో పెట్టుకొని స్మగ్లింగ్‌ చేసేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.దుబాయ్ నుంచి వచ్చిన ఉజ్బెకిస్తాన్‌ స్మగ‍్లర్లను ఢిల్లీ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరి వద్ద నుంచి  సుమారు 951 గ్రాముల బంగారాన్ని స‍్వాధీనం చేసుకున్నారు.

ఆ ఇద్దరు బంగారాన్ని ఎలా స్మగ్లింగ్‌ చేశారో తెలుసా? బంగారాన్ని పళ్ల సెట్ల తరహాలో డిజైన్‌ చేయించారు.ఆ సెట్ ను నోట్లో అమర్చుకుని దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చారు. అంత బంగారాన్ని నోట్లో ఎలా పెట్టుకున్నారనేదే ఆశ్చర్యంగా ఉన్నా.. ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించగా..స్మగ్లింగ్‌ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. నోట్లో బంగారం పెట్టుకొని స్మగ్లింగ్‌ చేయడంపై నెటిజన్లు తమదైన స్టైల్లో 'అంత బంగరాన్ని నోట్లో ఎలా దాచర్రా సామి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి: అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top