‘పెళ్లి కార్డులు ఇవ్వాలి.. తలుపు తీయండి’... అలా తెరిచారో లేదో.. !

రాయగడ(భువనేశ్వర్): ‘పెళ్లి కార్డులు ఇవ్వడానికి వచ్చాం.. తలుపు తీయండి’ అని పిలవడంతో బయటకు వచ్చిన వారిని దుండగులు బంధించి, దోపిడీకి ప్రయత్నించిన ఘటన స్థానిక బుదరావలసలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. బుదరావలసలో నివాసముంటున్న జగన్నాథ మహంతి అనే వ్యక్తి ఇంటికి ఐదుగురు వెళ్లి తలుపులు తట్టారు. మీ దుకాణానికి వెళ్తే.. మూసివేసి ఉందని, పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చామని పిలవడంతో జగన్నాథ భార్య జ్యోతి తలుపులు తెరిచారు.
అంతా లోపలికి వచ్చి, ఎండతో వచ్చాం.. తాగేందుకు నీళ్లు ఇవ్వండని అనడంతో ఆమె వంటగది వైపు వెళ్లగా ఆమె వెనకాల వెళ్లిన దుండగులు.. కత్తితో బెదిరించారు. అదే సమయంలో ఆమె కొడుకు ప్రీతమ్(15) తన తల్లిపై దాడి చేయండం గమనించి అవరడంతో అతడిని కొటి,్ట బాత్‌రూంలో బంధించారు. దీంతో వేరే గదిలో ఉన్న ఆమె కూతురు చాందిని(17) కేకలు వేయగా ఇరుగు–పొరుగు వారు రావడంతో దుండగులు బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న 15 వవార్డు కౌన్సిలర్ సంతోష్ కుమార్ దొళాయి పోలీసులకు సమాచారం అందించారు. సైంటిఫిక్ బృందం ఆధారాలు సేకరించిందని ఐఐసీ రస్మీరంజన్ ప్రదాన్ తెలిపారు.
చదవండి: వివాహేతర సంబంధం: రాత్రికి ఇంటికి వెళ్లాడు.. ఉదయం లేచి చూస్తే..