బిగుస్తున్న ఉచ్చు.. జనసేన నాయకుడిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న ఉచ్చు.. జనసేన నాయకుడిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌

Published Fri, Sep 9 2022 11:33 AM

Telangana Government Serious on Janasena ZPTC Member - Sakshi

సాక్షి, ఏలూరు: నకిలీ గ్యారంటీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని, బ్యాంకులను బురిడీ కొట్టించడానికి ప్రయత్నించిన వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు, జనసేన నేత గుండా జయప్రకాష్‌నాయుడు చుట్టూ ఉచ్చు బలంగా బిగుస్తోంది. తప్పుడు గ్యారంటీలతో తెలంగాణ మత్స్యశాఖలో చేపల, రొయ్య పిల్లల సరఫరా టెండర్లను ఆయన దక్కించుకోగా పరిశీలన సమయంలో ఫిర్యాదులు రావడంతో క్షుణ్ణంగా విచారిస్తే ఫోర్జరీ వ్యవహారం బయటపడింది. ఈ ఉదంతంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం రే గింది. మార్పు కోసం, ప్రజల కోసం ప్రశ్నించే పార్టీ అంటూ హడావుడి చేసే జనసేన నేతల్లో కొందరు పార్ట్‌టైంగా ఇలా ఫోర్జరీ వ్యవహారాలు సాగిస్తున్నారు.  

టెండర్ల కోసం అడ్డదారులు 
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్‌నాయుడు అతని అనుచరులపై తెలంగాణ ప్రభు త్వం సీరియస్‌గా దృష్టి సారించింది. తెలంగాణ మత్స్యశాఖ రెండు నెలల క్రితం ఆ రాష్ట్రంలోని చెరువుల్లో చేప, రొయ్య పిల్లలు పెంచడానికి రూ.113 కోట్ల వ్యయంతో టెండర్లు ఆహ్వానించింది. ఈ క్ర మంలో జయప్రకాష్‌నాయుడు జనసేన స్థానిక నే తలు, అతని అనుచరులు కరింశెట్టి వీరవెంకట సత్యనారాయణ, మద్దాల గణేష్, గంధం కేశవరావు తదితరులు 12 జిల్లాల్లో టెండర్లు దాఖలు చేశారు. టెండర్లు ఖరారు అయిన క్రమంలో బ్యాంకు గ్యారంటీ, పెర్ఫార్మెన్స్‌ గ్యారంటీ పత్రాలు సమర్పించి టెండర్లు తీసుకోవాల్సి ఉంటుంది.

చదవండి: (ఫోర్జరీ కేసులో జనసేన జెడ్పీటీసీ.. తెలంగాణ ప్రభుత్వం విచారణ)

అయితే వీరు పాలకొల్లులోని ఓ బ్యాంకు నుంచి నామమాత్రంగా బ్యాంకు గ్యారంటీ పత్రాలు తీసుకుని వాటి విలువలను భారీగా పెంచి, బ్యాంకర్ల సంతకాలు, బ్యాంకు స్టాంపులు అన్ని వారే సొంతంగా తయారు చేసుకుని నకి లీ పత్రాలను తెలంగాణ మత్స్యశాఖకు సమర్పించా రు. వీటిపై అక్కడ అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తెలంగాణ పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయా దవ్‌ విచారణకు ఆదేశించడంతో వ్యవహారం బయటపడింది. నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్రభుత్వాన్ని మోసం చేయడంపై మత్స్యశాఖ సీరియస్‌ అయి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.  

జనసేన నేతల్లో కలకలం 
జయప్రకాష్‌నాయుడు వ్యవహారం జనసేన నేతల్లో కలవరం పుట్టిస్తోంది. టెండర్‌ రద్దయి క్రిమినల్‌ కేసులుగా వ్యవహారం మళ్లిన నేపథ్యంలో ఏం జరుగుతుందా అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. 12 జిల్లాల్లో టెండర్లు దక్కించుకుని సుమారు రూ.8 కోట్ల మేర నకిలీ బ్యాంకు గ్యారంటీలను సృష్టించడం కలకలం రేపింది. స్థానికంగా తోటి కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జేపీ నాయుడుపై గతంలోనూ స్థానికంగా చెక్‌బౌన్స్, భూకబ్జా, సెంటున్నర భూమికి సంబంధించి వివాదం, వీరవాసరంలో ఓ అధ్యాపకుడిపై దాడి చేసిన సంఘటనకు సంబంధించి కేసులు నమోదైనట్టు సమాచారం.   

క్రిమినల్‌ కేసుల దిశగా..
పాలకొల్లులో జేపీ నాయుడు అండ్‌ టీం తీసుకున్న బ్యాంకు గ్యారంటీలను, వివరాలను తెలంగాణ అధికారులు సేకరించారు. బ్యాంకర్ల నుంచి తీసుకున్న మొత్తం లక్షల్లో ఉండగా కోట్లల్లో గ్యారంటీ సమర్పించారు. దీనిపై తె లంగాణ ప్రభుత్వం సదరు పాలకొల్లులోని బ్యాంకు నుంచి వివరాలు తీసుకుని నకిలీగా నిర్ధారించారు. ఫోర్జరీ, చీటింగ్‌ ఘటనలు ఉండటంతో క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి వీలుగా ఫిర్యాదు చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement