బైక్‌ను తాకాడని దళిత విద్యార్థి గొంతు పిసికిన టీచర్‌ | Teacher Attacked Dalit Student For Touching His Bike | Sakshi
Sakshi News home page

దారుణం.. బైక్‌ను తాకాడని దళిత విద్యార్థిని గదిలో బంధించి.. ఇనుప రాడ్‌తో కొట్టిన టీచర్‌

Sep 4 2022 7:12 AM | Updated on Sep 4 2022 7:12 AM

Teacher Attacked Dalit Student For Touching His Bike - Sakshi

స్కూల్‌ ఉపాధ్యాయుడు కృష్ణ మోహన్‌ శర్మ బైక్‌ను ఆరో తరగతి చదువుకుంటున్న ఓ దళిత విద్యార్థి తాకాడు. శర్మ ఆగ్రహంతో ఆ బాలుడిని గదిలో బంధించి, ఐరన్‌ రాడ్‌తో, చీపురుతో కొట్టాడు. అతడి గొంతు పిసికాడు

బలియా (యూపీ): తన మోటారుసైకిల్‌ను తాకాడనే కారణంగా ఓ దళిత విద్యార్థిని తరగతి గదిలో బంధించి, ఇనుప రాడ్‌తో కొట్టాడో ఉపాధ్యాయుడు. ఉత్తరప్రదేశ్‌లోని నగ్రా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రనౌపూర్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. ‘స్కూల్‌ ఉపాధ్యాయుడు కృష్ణ మోహన్‌ శర్మ బైక్‌ను ఆరో తరగతి చదువుకుంటున్న ఓ దళిత విద్యార్థి తాకాడు.

శర్మ ఆగ్రహంతో ఆ బాలుడిని గదిలో బంధించి, ఐరన్‌ రాడ్‌తో, చీపురుతో కొట్టాడు. అతడి గొంతు పిసికాడు. స్కూల్‌ సిబ్బంది బాధిత బాలుడిని కాపాడారు’ అని పోలీసులు తెలిపారు. ఆగ్రహించిన బాలుడి కుటుంబసభ్యులు శనివారం స్కూల్‌ వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు ఉపాధ్యాయుడు శర్మను సస్పెండ్‌ చేశారు.
చదవండి: పాపం పక్షులు.. గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement