కాపుకాసి కట్టెలతో దాడి | TDP leaders attacked YSRCP workers | Sakshi
Sakshi News home page

కాపుకాసి కట్టెలతో దాడి

Jul 26 2024 5:33 AM | Updated on Jul 26 2024 5:33 AM

TDP leaders attacked YSRCP workers

వైఎస్సార్‌సీపీ నేతలపై విరుచుకుపడిన టీడీపీ నాయకులు

ఇద్దరికి తీవ్ర గాయాలు 

యాడికి/పెద్దవడుగూరు: రాజకీయ కక్షతో టీడీపీ నాయకులు కాపుకాసి వైఎస్సార్‌ సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు వైఎస్సార్‌­సీపీ నాయకులకు తీవ్ర గాయా­లయ్యాయి. గురువారం రాత్రి అనంతపురం జిల్లా యాడికి మండలం పుప్పాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్రామస్తులు తెలిపిన వివ­రాల ప్రకారం.. పుప్పాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు సుదర్శన్, రంగస్వా­మిలను ఓ కేసు విషయంపై పోలీసులు గురు­వా­రం యాడికికి పిలిపించారు.  సాయంత్రం బైండోవర్‌ చేశారు. అనంతరం సుధాకర్‌ గ్రామానికే చెందిన మురళితో కలిసి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. వీరి వాహనం రాత్రి 8 గంటల సమయంలో గ్రామ సమీపానికి చేరుకోగా.. అప్పటికే అక్కడ కాపుకాసిన టీడీపీ నాయకులు దేవన్న, గంగిరెడ్డి, ప్రభాకర్, చరణ్, సుంకిరెడ్డి సురేష్, మహేష్‌ రాజు, శివ, చంద్రన్న తదితరులు కట్టెలతో దాడి చేశారు. 

ఈ ఘటనలో మురళి, సుధాకర్‌ తలలు పగిలి తీవ్రగాయాల­య్యాయి. సమాచారం అందుకున్న వైఎస్సార్‌­సీపీ శ్రేణులు ఘటనా స్థలానికి రాగా, టీడీపీ నాయకులు పరారయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలునుకున్న సీఐ నాగార్జునరెడ్డి పుప్పాల చేరుకుని అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని లకు‡్ష్మంపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై గురువారం సాయంత్రం టీడీపీ నాయకులు దాడి చేశారు. దీంతో ఐదుగురికి గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... లకు‡్ష్మంపల్లి గ్రామంలోని మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ వద్ద నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్త సత్యంరెడ్డి బైక్‌పై ఇంటికి వెళుతుండగా, టీడీపీ నేతలు హితే‹Ùరెడ్డి, హేమంత్‌రెడ్డి వాహనానికి అడ్డు వచ్చారు. అయినప్పటికీ సత్యంరెడ్డి వారిని తప్పించుకుని ఇంటికి వెళ్లడానికి ప్రయతి్నంచారు. టీడీపీ నేతలు ఆయన వాహనాన్ని వెంబడించి అడ్డుకున్నారు. 

ఆ సమయంలో అక్కడ ఉన్న వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ బ్రహ్మానందరెడ్డి, మరికొందరు వారిని ప్రశి్నంచారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు హితేష్‌రెడ్డి, హేమంత్‌రెడ్డి, రాజశేఖర్, సోమశేఖర్‌రెడ్డి తమ వెంట తెచ్చుకున్న కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో బ్రహా్మనందరెడ్డి తలకు తీవ్ర గాయాలు కాగా, సత్యంరెడ్డితోపాటు మరో ఇద్దరు మహిళలు, ఒక వృద్ధుడికి కూడా గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement