ప్రేమ పేరుతో వంచన | TDP leader made girl pregnant in Sri Sathya Sai district | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో వంచన

Aug 20 2024 5:42 AM | Updated on Aug 20 2024 5:42 AM

TDP leader made girl pregnant in Sri Sathya Sai district

బాలికను గర్భిణిని చేసిన టీడీపీ నాయకుడు 

పోక్సో కేసు నమోదు ఇప్పటికే హత్య కేసులో రిమాండులో ఉన్న నిందితుడు 

హిందూపురం అర్బన్‌: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఓ బాలిక (16)ను ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజేష్‌ ఇటీవల జరిగిన అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సతీష్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అతను ఈ కేసులో ప్రస్తుతం జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు. రాజేష్‌ రిమాండ్‌కు వెళ్లకముందు గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించాడు. శారీరకంగా లొంగదీసుకొని గర్భవతిని చేశాడు.

రెండు రోజుల క్రితం బాలిక కడుపునొప్పి­గా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరు ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించా­రు. వైద్యులు పరీక్షించి ఆమె గర్భవతి అని తేలి్చ.. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బాలికను అక్కడి ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. చిక్‌బళ్లాపుర ఎస్పీ కార్యాలయం నుంచి కేసును సోమవారం హిందూపురం అప్‌గ్రేడ్‌ పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు. దీంతో అప్‌గ్రేడ్‌ సీఐ ఆంజనేయులు బాధిత బాలికను గౌరీబిదనూరు నుంచి హిందూపురం తీసుకువచ్చి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆమె గర్భిణి అని నిర్ధారణ కావడంతో రాజే‹Ùపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement