వివాహేతర సంబంధం.. ఇంట్లో సహజీవనం చేస్తున్న వ్యక్తితో కనిపించడంతో.. | Sakshi
Sakshi News home page

Extramarital Affair: మహిళ వివాహేతర సంబంధం.. ఇంట్లో సహజీవనం చేస్తున్న వ్యక్తితో కనిపించడంతో..

Published Sat, Aug 13 2022 11:40 AM

Son Suicide Due To Mother Extramarital Affair In Eluru District  - Sakshi

భీమడోలు(ఏలూరు జిల్లా): తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందని మనస్తాపంతో కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భీమడోలులో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ చావా సురేష్‌ కథనం ప్రకారం.. భీమడోలు గాంధీబొమ్మ సెంటర్‌కు చెందిన దాసరి వెంకట్‌ (21) తాపీ కార్మికుడు. అతని చిన్నతనంలోనే తండ్రి మృతిచెందగా, తల్లితో కలసి ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు.
చదవండి: మహిళతో వెటర్నరీ అటెండర్‌ సన్నిహిత సంబంధం.. చివరికి ట్విస్ట్‌

గత కొన్నేళ్లుగా తన తల్లి వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎన్నిసార్లు మందలించినా ఆమె తీరు మారలేదు. శుక్రవారం తాపీ పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి భోజనం చేసేందుకు రాగా, ఇంట్లో తల్లి సహజీవనం చేస్తున్న వ్యక్తితో కనిపించింది. దీంతో కోపోద్రిక్తుడైన వెంకట్‌ తల్లితో గొడవ పడి బయటికి వెళ్లి మద్యం సేవించి తిరిగి వచ్చాడు. లోపలికి వెళ్లి గడియ పెట్టుకుని తల్లి చీరతో ఫ్యాన్‌కి ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటికి అతని స్నేహితుడు ఆనంద్‌ ఇంటికి రావడంతో ఆత్మహత్య విషయం వెలుగుచూసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement