ఏపీ ఫైబర్‌నెట్‌ కేసులో సాంబశివరావు అరెస్ట్‌

Sambasiva Rao Arrested In AP Fibernet Case - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో సాంబశివరావు అరెస్టయ్యారు. గత ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఆయన పనిచేశారు. ఇప్పటికే సాంబశివరావు, హరిప్రసాద్‌లను సీఐడీ విచారించింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం సాంబశివరావును సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు విజయవాడ స్పెషల్‌ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. సాంబశివరావును రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు సీఐడీ అధికారులు తరలించనున్నారు. టెర్రా సాఫ్ట్ కంపెనీకి సాంబశివరావు నిబంధనలకి విరుద్దంగా టెండర్లు కట్టబెట్టినట్లు సీఐడీ గుర్తించింది.  (చదవండి: భారీ మోసం: ఫైబర్‌నెట్‌లో ‘చంద్ర’జాలం)

ఫైబర్ నెట్‌లోని‌ తొలి ఫేజులో రూ.320 కోట్ల టెండర్లలో రూ.121 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది. ఇప్పటికే ఈ అక్రమాలపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ-1గా వేమూరి హరిప్రసాద్, ఏ-2గా సాంబశివరావులపై కేసు నమోదైంది. గత నాలుగైదు రోజులగా వేమూరితో పాటు సాంబశివరావును కూడా  సీఐడీ పలుమార్లు విచారించింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కి టెండర్లు దక్కేలా  వేమూరి హరిప్రసాద్, మాజీ ఎండి సాంబశివరావు చక్రం తిప్పారు.
చదవండి:
‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top