ఒంగోలు చెన్నకేశవ కాలనీలో దారుణం

Petrol Bottles Attack On House In Ongole - Sakshi

ఓ ఇంటిపై పెట్రోల్ బాటిళ్లతో దాడి

సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలు చెన్నకేశవ కాలనీలో దారుణం జరిగింది. ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో ఒక కుటుంబంపై కొంతమంది వ్యక్తులు పెట్రోల్ ఫైర్ బీర్ బాటిల్స్‌తో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. చెన్నకేశవ కాలనీకి చెందిన కుంచాల మహేష్‌కు ఒంగోలు మంగలపాలనికి చెందిన హైపర్ అలీ,అక్రమ్ అలీ,గుంటూరు మహేష్,సుమంత్, గణేష్‌లకు మధ్యఆర్థిక  విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఈ గొడవ జరిగినట్లు మహేష్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


గతంలో ఇరువురి మధ్య జరిగిన గొడవలు నేపథ్యంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే కేసులను ఉపసంహరించుకోవాలని మహేష్ కుటుంబంపై మిగిలిన వాళ్లు ఒత్తిడి తెచ్చారు. అయితే మహేష్ కుటుంబ సభ్యులు కేసును ఉపసంహరించుకున్నప్పటికి... పాత కక్షలను మనసులో పెట్టుకొని ఈ దాడులకు తెగ పడినట్లు మహేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. జరిగిన సంఘటనపై  కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top