బాలిక అనుమానాస్పద మృతితో... రణరంగమైన స్కూలు

Mysterious death of a student at a private school  - Sakshi

తమిళనాట తీవ్ర ఉద్రిక్తత

పోలీసులకు గాయాలు

సాక్షి, చెన్నై: ప్రైవేటు విద్యా సంస్థలో ఓ బాలిక అనుమానాస్పద మృతి తమిళనాట తీవ్ర ఉద్రిక్తతకు, ఆస్తుల విధ్వంసానికి దారి తీసింది. కాళ్లకురిచ్చి జిల్లా చిన్న సేలం సమీపంలోని కన్నియమూరు గ్రామంలో ఓ ప్రైవేటు ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో శ్రీమతి (17) అనే బాలిక ప్లస్‌–2 చదువుతోంది. రెండు రోజుల క్రితం హాస్టల్‌ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

రెండు రోజులుగా కుటుంబీకులు, బంధువులు అక్కడే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఆదివారం గుర్తు తెలియని యువకులు వందలాదిగా చొరబడి విధ్వంసానికి దిగారు. దాంతో డీఐజీ పాండియన్‌తో పాటు 20 మంది పోలీసులు గాయపడ్డారు. మంత్రులు, డీజీపీ, హోం శాఖ కార్యదర్శి వచ్చి వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top