డీజే.. డ్రగ్స్‌ రిస్క్‌!

Most Of The DJs Are Drug Addict And Also A Drug Dealer      - Sakshi

సిటీలో డిస్క్‌ జాకీలుగా కదం తొక్కుతున్న కుర్రాళ్లు డ్రగ్స్‌ కీలల్లో మాడిమసైపోతున్నారు. టీనేజ్‌ యువతకు క్రేజీ ప్రొఫెషన్‌గా ఇట్టే ఆకట్టుకునే ఈ వృత్తి ఇప్పుడు కొందరి పాలిట యమపాశంగా మారుతోంది. వారు నచ్చి మెచ్చిన సంగీతమే వారి చుట్టూ మరణమృదంగం మోగిస్తోంది.  
చుట్టూ లగ్జరీ.. వ్యసనాలపై సవారీ... 

సిటీ పబ్స్‌లో, క్లబ్స్‌లో ఈవెంట్లలో డీజెలుగా పనిచేసే కుర్రాళ్లలో అత్యధికులు మ్యూజిక్‌ పట్ల ఇంట్రెస్ట్‌ ఉన్నవారే. అరకొరగా ఉన్న డీజె స్కూల్స్‌లో లక్షలు వెచ్చించి కోర్సు చేసే ఈ కుర్రాళ్లకు ఆ తర్వాత జీతంగా లభించేది అంతంత మాత్రం. రూ.15 నుంచి 25 వేల లోపు జీతమే అయినప్పటికీ మ్యూజిక్‌ మీద ఉన్న క్రేజ్‌తో వీరు ఉద్యోగాలకు సై అంటారు. తదనంతరం వీరి చుట్టూ విలాసవంతమైన సమాజమే జతవుతుంది. మద్యపానం, ధూమపానం సర్వసాధారణ వ్యసనాలుగా మారతాయి. ఖర్చులకు ఏ మాత్రం సరిపోకపోవడంతో తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుంది. డిజె ముదిరి డ్రగ్‌ అడిక్ట్‌...డ్రగ్‌ డీలర్‌గా కూడా మారతాడు. మరోవైపు తాజా కరోనా, లాక్‌డౌన్‌ టైమ్‌లో పూర్తి ఆదాయం కోల్పోయిన డీజెలలో కొందరు మ్యూజిక్‌ని వదిలేసి ఇతర రంగాల్లోకి వెళ్లిపోతే..మరికొందరు ఇళ్లలో కూర్చుని ఆన్‌లైన్‌ ద్వారా ప్రొఫెషనల్‌ డ్రగ్స్‌ డీలర్లుగా మారిపోయారని సమాచారం. 

రేర్‌...రేవ్‌ బృందాలు... 
పబ్స్, క్లబ్స్‌కు వచ్చే కస్టమర్లకు బాగా సన్నిహితంగా మారేవాళ్లలో డీజేలే ముందుంటారు. కాబట్టి వెర్రెత్తించే సంగీతాన్ని ఇష్టపడేవారిని గుర్తించడం వీరికి సులభం.  దీంతో ఈ రకమైన సంగీతాన్ని ఇష్టపడుతున్న వారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడుతున్నారు. నగరంలో ప్రత్యేక పార్టీలను డీజేలు నిర్వహిస్తున్నారు. సదరు పార్టీల్లో రాజ్యమేలేదంతా అపరిమిత మత్తు...అందులో పడి చిత్తవ్వడమే.  

మెట్రోలతో మ్యూజిక్‌ అనుసంధానం.. 
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటీలో డీజేలే  నార్కొటిక్స్‌ కేసుల్లో బుక్‌ అవుతున్నారు. గోవాలో ఇది నిత్యకృత్యం అయింది  కోట్ట రూపాయల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు వీక్లీ రైడ్స్‌లో వారి నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. చెన్నైకి చెందిన సౌండ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్ధిని అరెస్ట్‌ చేసి  రూ.8లక్షలు విలువైన సెకోట్రోపిక్‌ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూర్‌లో పనిచేసే డీజే ధీరజ్‌ని అరెస్ట్‌ చేసినప్పుడు అతను హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో క్లయింట్స్‌ ఉన్నట్టు చెప్పినట్టు సమాచారం.  

విదేశీ రాక...డ్రగ్స్‌కు కాక... 
డ్రగ్స్‌ హబ్‌ లాంటి గోవా చీప్‌ నార్కోటిక్స్‌కు కూడా పేరొందింది. దానితో గోవా డీజేలకు నగరం నుంచి డిమాండ్‌ పుంజుకుంది. అయితే అక్కడ వారానికోసారి డ్రగ్‌ రైడ్‌ నిర్వహిస్తున్నారు నార్కొటిక్‌ యాక్టివిటీస్‌లో జోక్యం పెరిగిందనే కారణంగా 2013లో గోవా íసీఎం విదేశీ డీజేలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దాంతో హైదరాబాద్‌ వైపు వీరు తమ చూపు మరల్చారని తెలుస్తోంది  నగరానికి విదేశీ  డీజేలను రప్పించడం కూడా డ్రగ్‌ కల్చర్‌కి ఊపు తెస్తోంది.  

(చదవండి: తలొగ్గేది ప్రేమకే.. నేను అహంభావిని కాదు.. శక్తిమంతురాలిని: తమిళిసై)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top