గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడి 

Molestation Attack On Tribal Woman - Sakshi

కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో దారుణం 

వెలుగోడు/గుంటూరు రూరల్‌: గిరిజన మహిళ (45)పై ముగ్గురు గిరిజన యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం నల్లమల అటవీ శివారు ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..  

► వెలుగోడు జమ్మినగర్‌ తండాకు చెందిన భార్యాభర్త గాలేరుపై నిర్మిస్తున్న వంతెన వద్ద వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు.  
► దీని పక్కనే ఉన్న గూడెంలో కొందరు నాటుసారా కాస్తున్నారు. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారని నారపురెడ్డికుంట గూడేనికి చెందిన కొంతమంది జూలై 31 అర్ధరాత్రి భర్తపై దాడి చేసి భార్యపై లైంగికదాడికి ఒడిగట్టారు.  
► సోమవారం వెలుగోడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు తనపై లైంగికదాడి చేశారని ఫిర్యాదు చేసింది. 
► దీంతో పోలీసులు తోట నాగన్నతోపాటు మరో ఇద్దరిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఇంకొకరి కోసం గాలిస్తున్నారు. 
► కాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మేకతోటి సుచరిత, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top