
మహబూబ్‌నగర్ (ఊర్కొండ) : మండలంలోని ఇప్పపహాడ్‌కి చెందిన యాదయ్య, రత్నమ్మ పెద్ద కుమార్తె సరస్వతి(27) గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. సరస్వతి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో మెడికల్ పీజీ చదువుతోంది. ఆత్మహత్య సమాచారం అందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే హైదరాబాద్ బయల్దేరారు. ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం శుక్రవారం స్వగ్రామమైన ఇప్పపహడ్‌కు మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సరస్వతి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.