Anantapur Crime News: Man Molested His Own Brother Daughter - Sakshi
Sakshi News home page

Anantapur Crime News: చిన్నాన్నే చిదిమేశాడు.. తినుబండారాలు కొనిస్తానంటూ..

Jul 29 2022 2:48 PM | Updated on Jul 29 2022 3:11 PM

Man Molested His Own Brother Daughter In Anantapur District - Sakshi

నిందితుడిని అరెస్టు చూపుతున్న డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు  

ఇంటి యజమాని సొంత తమ్ముడు దుమాల్‌సాయి సైతం వారితోనే కలిసి ఉంటున్నాడు. ఈ నెల 27న (బుధవారం) రాత్రి  చిన్నారికి తినుబండారాలు కొనిస్తానంటూ బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతపురం క్రైం: సొంత అన్న కూతురుపై అత్యాచారం చేసిన ఓ మృగాడిని పోలీసులు అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. వివరాలను నగరంలోని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వెల్లడించారు. నగరంలోని త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన దంపతులకు ఆరేళ్ల చిన్నారి ఉంది.
చదవండి: నాలుగు కార్లలో ఏముంది.. నటి అర్పితా ముఖర్జీ కేసులో మరో ట్విస్ట్‌

ఇంటి యజమాని సొంత తమ్ముడు దుమాల్‌సాయి సైతం వారితోనే కలిసి ఉంటున్నాడు. ఈ నెల 27న (బుధవారం) రాత్రి  చిన్నారికి తినుబండారాలు కొనిస్తానంటూ బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప ఎంత సేపటికీ రాకపోవడంతో ఆరా తీసిన తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకుని బోరున విలపించారు. దారుణం కాస్త బయటపడడంతో దుమాల్‌సాయి పారిపోయాడు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ కత్తి శ్రీనివాసులు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు గురువారం ఉదయం రైల్వే స్టేషన్‌ వద్ద తచ్చాడుతున్న దుమాల్‌సాయిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిపై రేప్, పోక్కో చట్టం కింద కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement