భార్యను కొట్టి చంపి.. మృత దేహం‍పై కూరగాయల బస్తాలు వేసి.. సొంతూరికి

Man Assassinated Wife For A Small Reason In Uppal - Sakshi

భార్యను కడతేర్చిన భర్త

ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి.. 

సాక్షి, ఉప్పల్‌: పద్దెనిమిది సంవత్సరాలు కాపురం చేసిన భార్యను చిన్న కారణంతో భర్త కడతేర్చిన సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోవింద రెడ్డి, బాధితులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామానికి చెందిన చిత్తలూరు శ్రీను(40)కు అదే మండలం ఈటూరు గ్రామానికి చెందిన చిత్తలూరు  సురాంభ (35)తో 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు రామంతాపూర్‌ వెంకటరెడ్డినగర్‌లో కాపురముంటూ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు.
చదవండి: బాలికపై లైంగిక దాడి.. వీడియో తీసిన మరో యువకుడు

గత నెల 29వ తేదీ రాత్రి ఇంట్లో  భార్య భర్తలకు చిన్న విషయమై వివాదం ప్రారంభమై చిలికి చిలికి గాలి వానగా మారింది. దీంతో ఆవేశానికి గురైన భర్త శ్రీను భార్యను విచక్షణరహితంగా కొట్టి,  హింసించడంతో తట్టుకోలేక ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో అదే రాత్రి తన టాటా ఏస్‌ వాహనంలో భార్య మృతదేహాన్ని వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా శవంపై కూరగాయల బస్తాలు పేర్చి సొంత ఊరికి బయలుదేరాడు. అనంతరం తన భార్యకు బీపీ ఎక్కువై మృతి చెందిందని ఊరికి తీసుకు వస్తున్నానని గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.
చదవండి: Check Dam: ఇద్దరు చిన్నారులను మింగిన చెక్‌డ్యాం

మరుసటిరోజు అంత్యక్రియలకు వచ్చిన వారికి సురాంభ ఒంటిపై దెబ్బలు ఉండటం కనిపించి అనుమానం వచ్చి నాగారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వచి్చన నాగారం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం చేయించారు. భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పెట్టాడు. దీంతో నాగారం పోలీసులు కేసును ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయగా ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top