ఇంటికి వెళ్తే రానివ్వరని మనస్తాపంతో హిజ్రా ఆత్మహత్య.. | Hijra suicide in Kurnool | Sakshi
Sakshi News home page

ఇంటికి వెళ్తే రానివ్వరని మనస్తాపంతో హిజ్రా ఆత్మహత్య..

May 9 2023 1:37 PM | Updated on May 9 2023 1:40 PM

Hijra suicide in Kurnool - Sakshi

కర్నూలు: పట్టణంలోని త్రివర్ణ కాలనీలో నివాసం ఉంటున్న సాయిపల్లవి (సాయినాథ్‌రెడ్డి వయస్సు 21) అనే హిజ్రా ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణ ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన సాయినాథరెడ్డి నాలుగేళ్ల క్రితం హిజ్రాగా మారి డోన్‌ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పట్టణంలో నివసించేవారు.

బంధువులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, ఇంటికి వెళితే తనను నిరాకరిస్తారని మనస్తాపంతో సోమవారం తెల్లవారు జామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన తోటి హిజ్రాలు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాయినాథ్‌రెడ్డి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement