టీడీపీ కార్యాలయం వద్ద ప్రమాదం | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయం వద్ద ప్రమాదం

Published Sat, Mar 25 2023 5:09 AM

Fire Accident at TDP office - Sakshi

మంగళగిరి: గుంటూరు జిల్లా ఆత్మకూరులో­ని టీడీపీ జాతీయ కార్యాలయం వద్ద శుక్రవారం బాణసంచా కాలుస్తుండగా ప్రమా­దం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ర్యాలీగా ఇక్కడకి వచ్చారు.

ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు మద్యం మత్తు­లో ఇష్టానుసారంగా బాణసంచా కా­ల్చా­­రు. దీంతో అక్కడ ఉన్న బాణసంచాకు అంతటికీ నిప్పు రవ్వలు అంటుకుని ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమా­దంలో మంగళగిరిలోని మార్కండేయ కాల­నీ­కి చెందిన తాడిశెట్టి చెన్నయ్య, తాడిశెట్టి వెంకటేశ్వర్లు, నంబూరుకు చెందిన కారు డ్రైవర్‌ కొడాలి షణ్ముఖ, కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కేసర గ్రామానికి చెందిన ఎస్‌­కే హుస్సేన్‌ సాహెబ్‌లు తీవ్రంగా గాయపడ్డా­రు.

వీరిని చికిత్స నిమిత్తం చినకాకాని ఎ­న్నా­­రై వైద్యశాలకు తరలించారు. గాయపడి­న వారిలో చెన్న­య్య, వెంకటేశ్వర్లు పరి­స్థితి వి­ష­మంగా ఉన్నట్లు వైద్యులు తెలిపా­రు. కా­ర్యా­లయం వద్ద ర్యాలీ అదుపుతప్పడం, కార్య­­కర్తలు మద్యం సేవించి ఉండటం ప్ర­మా­­దానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement