వృద్ధురాల్ని చంపిన ఏనుగు  

Elephant Kills Old Woman In Karnataka - Sakshi

కేజీఎఫ్‌(కర్ణాటక): బంగారుపేట తాలూకా బూదికోట ఫిర్కా గుల్లహళ్లి గ్రామంలో ఏనుగు దాడిలో మహిళ మృతి చెందింది. గుల్లహళ్లి గ్రామానికి చెందిన సిద్దమ్మ (59) శనివారం తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో గుల్లహళ్లి గ్రామం నుంచి పక్కలోనే ఉన్న గొడగుమందె గ్రామానికి తన మనవడిని చూడడానికి కాలినడకన బయల్దేరింది. మార్గమధ్యంలో అడవి ఏనుగు.. సిద్దమ్మపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

ఎమ్మెల్యే ఎస్‌ఎన్‌ నారాయణస్వామి సిద్దమ్మ కుటుంబాన్ని పరామర్శించి అంత్య సంస్కారం కోసం కొంత సహాయ ధనం అందించారు. కాగా, గత కొద్ది నెలల కాలంగా బూదికోట ఫిర్కాలో మనుషులపై, పంటలపై ఏనుగుల దాడులు పెరిగాయి. ప్రజలు భయం నీడన జీవించాల్సి వస్తోంది. ఇంతవరకు తాలూకాలో ఏనుగుల దాడిలో 9 మంది మరణించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top