ఉపసర్పంచ్‌ కుటుంబం ఆత్మహత్యాయత్నం

Deputy Sarpanch Family Suicide Attempt In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ఉపసర్పంచ్‌ కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన కొణిచర్ల మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొణిచర్ల మండలం బోడియాతండా గ్రామ ఉపసర్పంచ్‌ బాబురావు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. గత కొద్దిరోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ( సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్‌! )

శనివారం తాను పురుగుల మందు తాగి, భార్య రంగమ్మ, ఇద్దరు చిన్న పిల్లలు మహని (4) హనిస్విని(3)లకు తాగించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వీరిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top