ఐదేళ్ల నాటి హత్య కేసు.. ఇప్పటికి ఓ కొలిక్కి! | Delhi Police Finally Cracked Down On Assassination Case After Five Years | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల నాటి హత్య కేసు.. ఇప్పటికి ఓ కొలిక్కి!

Jul 29 2021 2:28 PM | Updated on Jul 29 2021 2:33 PM

Delhi Police Finally Cracked Down On Assassination Case After Five Years - Sakshi

న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. గంజాం జిల్లాలోని భంజనగర వద్ద ఐదేళ్ల క్రితం జరిగిన హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రోహిత్ (27), రింకు అలియాస్ భూపేష్ (27), సచిన్ అలియాస్ గౌరవ్ (28), దీపాంశు అలియాస్ మోంటు (26)లు సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో నివాసితుగా పోలీసులు పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే.. రోహిత్ అనే వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి 2016, డిసెంబర్‌ 28న రాక్‌ గార్డెన్‌ నుంచి వస్తున్నాడు. ఆ సమయంలో ఉస్మాన్ ఖాన్‌ అనే వ్యక్తి రోహిత్ స్నేహితురాలిని లైంగికంగా వేధించాడు. దీంతో  ఓ నలుగురు వ్యక్తులు కలిసి ఉస్మాన్‌ను కత్తితో నరికి చంపారు. దీనికి సంబంధించి 2016, డిసెంబర్ 28న రాత్రి 8 గంటల ప్రాంతంలో పటేల్ నగర్ పోలీసులకు ఓ వ్యక్తి నుంచి ఫోన్‌​ వచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఖాన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) రాజేష్ డియో అన్నారు.

ఇలా వెలుగులోకి..
పోలీసులు ఈ కేసులో అనుమానితులు వివరాలను సేకరించడానికి హ్యూమన్‌ ఇంటలీజెన్స్‌ నెట్‌వర్క్‌ను ఉపయోగించారు.  జూలై 27న కరోల్ బాగ్‌కు చెందిన రోహిత్‌ అనే వ్యక్తి అతడి స్నేహితులు కలిసి  ఖాన్‌తో గొడవ  పడినట్లు గుర్తించారు. రోహిత్‌ని అరెస్టు చేసి విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement