ఎర్ర చందనం స్మగ్లర్ల ఎత్తుగడ.. కార్గో కస్టమ్స్‌ అధికారుల చిత్తు!

Custom Officers Seized Red Sandalwood In Karnataka At Kempegowda Airport - Sakshi

యశవంతపుర: బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో రూ.కోట్ల విలువైన ఎర్ర చందనం దుంగలు పట్టుబడ్డాయి. వివరాలు... ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త  దుబా య్‌కు అక్రమంగా ఎర్రచందనం తరలించేం దుకు ప్లాన్‌ వేశాడు. దుంగలను ముక్కలు చేసి చెక్కపెట్టెల్లో ప్యాక్‌ చేసి బెంగళూరులోని ఒక రవాణా ఏజెన్సీ ద్వారా ఎయిర్‌పోర్టుకు తరలించారు.

ఇనుప పైపులు ఎగుమతి చేస్తున్నట్లు ఎయిర్‌ కార్గో కస్టమ్స్‌ అధికారులను నమ్మించారు. అయితే ఇనుప పైపులకు పకడ్బందీ ప్యాక్‌పై అనుమానంతో తనిఖీ చేయగా.. ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top