8 mans swallow 4 kg gold illegal transport at chennai - Sakshi
Sakshi News home page

కడుపులో 4.15 కిలోల బంగారం 

Published Tue, Feb 2 2021 8:20 AM

Chennai Man Swallow 4 KG Gold For Illegal Transport - Sakshi

సాక్షి  ప్రతినిధి, చెన్నై: బంగారాన్ని మాత్రల రూపంలో మింగేసి అక్రమరవాణాకు పాల్పడిన 8 మందిని చెన్నై విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. వీరి కడుపులో నుంచి రూ. 2.17 కోట్ల విలువైన 4.15 కిలోల బంగారాన్ని బయటకు తీశారు. వందేభారత్‌ ఎయిర్‌ ఇండియా విమానం జనవరి 30న దుబాయ్‌ నుంచి చెన్నైకి చేరుకుంది. అందులో వచ్చిన ప్రయాణికుల్లో 8 మందిపై కస్టమ్స్‌ అధికారులకు అనుమానం రావడంతో తనిఖీ చేశారు. ఏమీ దొరకలేదు. అయినా అనుమానం తీరకపోవడంతో విమానాశ్రయంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి కడుపు భాగాన్ని ఎక్స్‌రే తీయగా బంగారు ఉండలు మాత్రల రూపంలో కనపడ్డాయి.  
(చదవండి: నువ్వు గ్రేట్‌ బంగారం!)

మంచినీళ్లు తాగుతూ మాత్రల రూపంలో బంగారాన్ని మింగినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. ఈ 8 మందిని చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి బంగారు మాత్రలను బయటకు తీశారు. వారి కడుపులో నుంచి వచ్చిన రూ.2.17 కోట్ల విలువైన 4.15 కిలోల 161 బంగారు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. కనకవల్లి, నిషాంతి, కళా, ఫాతిమా, పుదుకోటైకి చెందిన జయరాజ్, జగదీష్, కబర్‌ఖాన్, రామనాథపురానికి చెందిన హకీంలను చెన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చి అరెస్ట్‌ చేశారు.   

Advertisement
Advertisement