● కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్‌ మొదలు ● మంచి భవిష్యత్‌కు ఏ కోర్సు మంచిది ● లక్ష్యం స్పష్టంగా ఉంటేనే విజయం ● సరైన సమయంలో, సరైన కోర్సు, సరైన లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

● కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్‌ మొదలు ● మంచి భవిష్యత్‌కు ఏ కోర్సు మంచిది ● లక్ష్యం స్పష్టంగా ఉంటేనే విజయం ● సరైన సమయంలో, సరైన కోర్సు, సరైన లక్ష్యం

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

● కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్‌ మొదలు ● మంచి భవిష్యత్‌కు ఏ కోర్సు మంచిది ● లక్ష్యం స్పష్టంగా ఉంటేనే విజయం ● సరైన సమయంలో, సరైన కోర్సు, సరైన లక్ష్యం

ఎంఈసీతో విస్తృత అవకాశాలు

ఎంఈసీలో మ్యాథ్‌మెటిక్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌ సబ్జెక్టులు ఉంటాయి. ఈ గ్రూప్‌లో ఇంటర్‌ పూర్తి చేస్తే ఇటు మ్యాథమెటిక్స్‌ అర్హతగా బీఎస్సీతో పాటు కామర్స్‌ అర్హతగా బీకాం రెండు మార్గాలు ఉంటా యి. చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సుల్లో రాణించవచ్చు. కంప్యుటేషనల్‌, కాలిక్యులేషనల్‌ స్కిల్స్‌ ఉన్న వారికి వివిధ కంపెనీల్లో అవకాశాలు ఉంటాయి.

చిత్తూరు కలెక్టరేట్‌ : పదో తరగతి టర్నింగ్‌ పాయింట్‌కు చేరుకున్న విద్యార్థులు పదిలమైన అడుగులు వేయాలి. పాఠశాల విద్యాభ్యాసం ఒక ఎత్తు అయితే.. ఇకమీదట వేసే అడుగులు మరో ఎత్తు. టెన్త్‌ తర్వాత ఎంచుకునే కోర్సులు భవితకు దారి చూపిస్తాయి. పిల్లలు తమకు ఇష్టమైన రంగం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా తమ ఇష్టాలకు అనుగుణంగా కాకుండా పిల్లల ఆసక్తిని గుర్తించి అటువైపు ప్రోత్సహించాలి.

బైపీసీతో మెడిసిన్‌, ఇతర కోర్సులు

మెడిసిన్‌ చేయాలనుకునే వారు బైపీసీలో చేరాలి. బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులు. ఇంటర్‌ బైపీసీ విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ యూజీ పరీక్షలో ర్యాంకు సాధిస్తే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌, తదితర మెడిసిన్‌, అనుబంధ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఏపీ ఎంసెట్‌ ఉత్తీర్ణత సాధించి వెటర్నరీ సైన్స్‌, అగ్రికల్చర్‌ సైన్స్‌, బి.ఫార్మసి వంటి విభాగాల్లోనూ బ్యాచిలర్‌ డిగ్రీ, ఆ తర్వాత పీజీ, పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది. అగ్రికల్చర్‌ డిప్లొ మా, వెటర్నరీ డిప్లొమా కూడా చేయొచ్చు.

సీఈసీతో అకౌంట్స్‌..

సీఈసీలో ప్రధానంగా కామర్స్‌, ఎకనామిక్స్‌, సివి క్స్‌ సబ్జెక్ట్‌లు ఉంటాయి. సీఈసీ విద్యార్థులకు ఉన్న త విద్యాపరంగా బీకామ్‌ ముఖ్య మార్గంగా నిలుస్తోంది. బీకాం చదువుతూనే చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కామర్స్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. తద్వారా కార్పొరేట్‌ కంపెనీల్లో ఇంటర్నల్‌ ఆడిటర్స్‌, స్టాక్‌ ఆడిటర్స్‌, ఫైనాన్షియల్‌ మేనేజర్స్‌, అసిస్టెంట్‌ కంపెనీ సెక్రటరీస్‌ వంటి ఉన్నత ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. బ్యాచిలర్‌ డిగ్రీ బీకామ్‌ తర్వాత పీజీ స్థాయిలో ఎంకామ్‌, ఐసెట్‌ ద్వారా ఎంబీఏలో చేరవచ్చు.

హెచ్‌ఈసీతో పోటీ పరీక్షల్లో ముందంజ

సివిల్స్‌, గ్రూప్స్‌ వంటి పోటీ పరీక్షల్లో ముందంజ లో నిలిపే గ్రూప్‌ హెచ్‌ఈసీ. ఇందులో హిస్టరీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌ సబ్జెక్టులు ఉంటాయి. వీటిపై పట్టు సాధించడం వల్ల పలు ఉద్యోగ పోటీ పరీక్షల్లో సుల భంగా విజయం సాధించవచ్చు. హెచ్‌ఈసీ అర్హత గా ప్రవేశం లభించే బీఏలోనూ జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రైవేట్‌ రంగంలోనూ ఉద్యోగావకాశాలను సొంతం చేసుకోవచ్చు.

జిల్లా సమాచారం

ఇంటర్‌ తర్వాత వెంటనే ఉపాధి పొందడానికి ఒకేషనల్‌ కోర్సులు ఉపయోగపడతాయి. ఇందులో ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌షిప్‌ నుంచి ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్‌తో పాటు టెక్నికల్‌, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో నైపుణ్యాలు అందించే కోర్సులు ఉన్నాయి. అగ్రికల్చర్‌, బిజినెస్‌ అండ్‌ కామర్స్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, హోం సైన్స్‌, హ్యుమానిటీస్‌, పారా మెడికల్‌ విభాగాల్లో మొత్తం 27 ఒకేషనల్‌ కోర్సులు ఉన్నాయి.

ఎంపీసీతో ఇంజినీరింగ్‌..

ఎంపీసీలో ప్రధాన సబ్జెక్టులు మ్యాథమెటిక్స్‌, ఫిజి క్స్‌, కెమెస్ట్రీ ఉంటాయి. ఈ గ్రూప్‌ అర్హత ఆధారంగా ఎంసెట్‌, జేఈఈ మెయిన్స్‌, జేఈఈ అడ్వాన్సుడు తదితర ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాఽధించి ఇంజినీరింగ్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎంపీసీ విద్యార్థులు ఇంటర్‌ తర్వాత ఎన్‌డీఏ, 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం వంటి పరీక్షలతో డిఫెన్స్‌ రంగంలోనూ ఉద్యోగాలు పొందవచ్చు. డిగ్రీ మ్యాథ్స్‌, సైన్స్‌ కోర్సులతో పాటు ఆర్ట్స్‌, హ్యూ మానిటీస్‌, లా సంబంధిత కోర్సుల్లోనూ చేరే అవకాశం ఉంది.

ఐటీఐతో

అవకాశాలు

వృతి విద్య శిక్షణ, స్వయం ఉపాధికి ఐటీఐ, ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ (ఐటీఐ), నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ పరిధిలోని ఐటీఐల్లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఫిట్టర్‌, రిఫ్రిజిరేషన్‌, ఎయి ర్‌ కండీషనింగ్‌ తదితర పదుల సంఖ్యలో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement