చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలకు సంబంధించి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు రాష్ట్ర పరీక్షల విభాగం అధికారులు ఈనెల 7వ తేదీ వరకు అవకాశం కల్పించినట్టు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. రీ కౌంటింగ్‌కు ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీటిని ఆయా పాఠశాలల వెబ్‌సైట్‌లో హెచ్‌ఎం లాగిన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలన్నారు. ఫీజు ఆన్‌లైన్ విధానంలోనే చెల్లించాలని డీఈవో వెల్లడించారు.
ఆధునిక వైద్యంపై దృష్టి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల వినియోగాన్ని మరింత మెరుగుపరచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీ నుంచి మంగళవారం నిర్వహించిన ఇన్‌న్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ హెచ్‌ఎంఐఎస్ పోర్టల్ పై వర్చువల్ కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. డీఎంహెచ్‌ఓతో పాటు డీసీహెచ్‌ఎస్, మెడికల్ సూపరింటెండెంట్, ఎస్‌ఓతో పాటు జిల్లా ఆస్పత్రి సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. వివిధ అంశాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఆధునిక పరికరాల వినియోగం, క్వాలిఫైడ్ రిసోర్స్ పర్సన్స్ మెయింటెనెన్స్, అలాగే అన్ని రకాల ఆరోగ్య డేటా సేకరణ విధానాలపై విస్తృతంగా చర్చించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఆరోగ్య సేవల తీరును అధికారులు విశదీకరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగశశిభూషణ్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మాంజలి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషశ్రీ, ఎస్‌ఓ జార్జ్ తదితరులు పాల్గొన్నారు.
‘కిశోర వికాసం’ ఎక్కడ?
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సీ్త్ర శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిశోరి వికాసం శిబిరాలు గాడితప్పుతున్నాయి. బాల, బాలికల సమగ్రాభివృద్ధికి కిశోర వికాసం వేసవి శిబిరాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 1 నుంచి జూన్ 9వ తేదీ వరకు ప్రత్యేకంగా రూపొందించిన సమ్మర్ క్యాలెండర్ ప్రకారం శిబిరాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే జిల్లా ఐసీడీఎస్ అధికారుల అలసత్వం వల్ల ఈ శిబిరాలు గాడితప్పుతున్నాయి. శిబిరాల నిర్వహణపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు కనీస అవగాహన లేకుండా పోయింది. పకడ్బందీగా అమలు చేయాల్సిన ఐసీడీఎస్ అధికారులు క్షేత్ర స్థాయి లో తనిఖీలు చేయకుండా కార్యాలయాలకు పరిమితమవుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో కిశోర వికాసం వేసవి శిబిరాల ఆశయం నెరవేరడం లేదు. శిబిరాల నిర్వహణకు మంజూరయ్యే నిధులను సైతం పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.


