లెర్న్‌ టు లెర్న్‌ ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

లెర్న్‌ టు లెర్న్‌ ముఖ్యం

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

పదో తరగతి తర్వాత విద్యార్థులు గ్రూప్‌ను మాత్రమే కాదు, లెర్నింగ్‌ ఎకోసిస్టమ్‌ను ఎంచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను గమనిస్తే రాబోయే పదేళ్లలో అనేక కొత్త రకాల ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి విద్యార్థులు ప్రస్తుత ట్రెండ్‌ను చూసి కోర్సు ఎంచుకోకూడదు. లెర్న్‌ టు లెర్న్‌ (ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవడం) అనే సూత్రాన్ని అలవర్చుకోవాలి. సైన్స్‌ అయినా, ఆర్ట్స్‌ అయినా విశ్లేషణాత్మక ఆలోచన ఉన్న వారికి ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. చదువు సమాజంలోని సమస్యలకు పరిష్కారం చూపేలా ఉండాలి. – పాండురంగస్వామి, రిటైర్డ్‌ డీఈవో, విద్యావేత్త

పక్కవారితో పోల్చకూడదు

పదో తరగతి దాటిన విద్యార్థులు మానసికంగా పెద్ద మార్పులకు లోనవుతుంటారు. ఈ సమయంలో వారిపై ర్యాంకుల ఒత్తిడి పెంచడం వల్ల వారిలో ఉండే సహజమైన నేర్చుకునే గుణం దెబ్బతింటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాన్ని పక్కవారితో పోల్చకూడదు. ప్రతి బిడ్డలోనూ ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహించినప్పుడే వారు ఏ రంగంలో ఉన్నా ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. విద్య అనేది ఉద్యోగం కోసం కాదు, అది జీవితాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కావాలి. – రాజేంద్రప్రసాద్‌, డీఈవో, చిత్తూరు జిల్లా

పునాది బలంగా ఉండాలి

10వ తరగతి ఫలితాలు రాగానే విద్యార్థులు గందరగోళానికి గురవుతారు. ఈ దశలో వారికి సరైన కెరీర్‌ కౌన్సెలింగ్‌ అవసరం. విద్యార్థులు తమ బలాలను గుర్తించి, థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. రేపటి పోటీ ప్రపంచంలో నిలబడాలంటే సర్టిఫికెట్లు సరిపోవు. నైపుణ్యం కూడా ఉండాలి. ఒకప్పుడు ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ మాత్రమే కెరీర్‌. ఇప్పుడు డేటా సైన్స్‌, డిజైన్‌, లా, హ్యుమానిటీస్‌లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అభిరుచి అనే పునాదిపై పడాలి. – రఘుపతి, ఇంటర్మీడియెట్‌ డీఐఈవో. చిత్తూరు జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement