చరిత్ర సృష్టించిన విజయ్‌ | - | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన విజయ్‌

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

● కొనియాడిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

కార్వేటినగరం: తమిళనాడు యువతకు హీరో.. పేదల ప్రజల ఆరాధ్య దైవం విజయ్‌ విజయం వెనుక విశేష కృషి ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. పుత్తూరులోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక హీరోగా యువత గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారని తెలిపారు. జగనన్న ఫొటోతో ఎన్నికల బరిలో దిగి తమిళ ప్రజల ఓట్లను గెలుచుకున్నాడన్నారు. జగనన్న బాటలో నడిచి ఇచ్చిన హామీలను తూచాతప్పకుండా అమలు చేయాలని సూచించారు. మొదటి నుంచి కూడా విజయ్‌ జగనన్నకు సన్నిహితుడిగా ఉంటూ వచ్చారని, ఒక హీరో స్థాయిలో ఉంటున్న విజయ్‌ ఎక్కడా గర్వపడకుండా జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో పెట్టుకుని ఓట్లు అడగడం ఆయన హుందాతనానికి నిదర్శనమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement