పునాది లేని చదువులు | - | Sakshi
Sakshi News home page

పునాది లేని చదువులు

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

● జిల్లాలో 4,872 మంది టెన్త్‌ విద్యార్థులు ఫెయిల్‌ ● సైన్స్‌, మ్యాథ్స్‌ అంటే భయం, తెలుగు అంటే నిర్లక్ష్యం ● అమ్మ భాషలోనూ అపజయమేనా? ● జిల్లాలో కుప్పకూలుతున్న విద్యావ్యవస్థ

ఫలితాల వివరాలు
పరీక్షలకు హాజరైన బాలురు 10,711 మంది హాజరైన బాలికలు 10,194 మంది ఉత్తీర్ణులైన బాలురు 7,630 మంది ఉత్తీర్నులైన బాలికలు 8,403 మంది ఫెయిల్‌ అయిన బాలురు 3,081 మంది ఫెయిల్‌ అయిన బాలికలు 1,791 మంది

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా 4,872 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. అంటే దాదాపు ఐదు వేల మంది భవిష్యత్‌ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఇంతమంది విద్యార్థులు ఎందుకు వెనుకబడ్డారు? పాఠశాలల్లో పర్యవేక్షణ లోపమా? బోధనా పద్ధతుల్లో లోపమా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా విద్యార్థులు సైన్స్‌, సోషల్‌, గణితం, తెలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యారు. గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో ప్రాథమిక అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని విద్యావేత్తలు చెబుతున్నారు. బట్టీపట్టే పద్ధతికి అలవాటు పడడం వల్ల విద్యార్థులు అప్లికేషన్‌ మెథడ్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయినట్లు తెలుస్తోంది.

అమ్మభాషలోనూ అపజయమే

జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో అమ్మభాషలో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగులో అక్షర దోషాలు లేకుండా రాయలేకపోవడం, వాక్య నిర్మాణం సరిగ్గా చేయలేకపోవడం వల్ల భాషా సబ్జెక్టుల్లో మార్కులు తగ్గుతున్నట్లు విద్యావేత్తలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ తెలుగులో ఫెయిల్‌ కావడం విద్యావ్యవస్థకు సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.

అర్బన్‌ ప్రాంతాల్లో అధ్వాన్నం

గ్రామీణ ప్రాంతాలకంటే మెరుగైన సౌకర్యాలు, ట్యూషన్‌ సెంటర్లు ఉండే పట్టణ ప్రాంతాల్లోనే విద్యాప్రమాణాలు అధ్వాన్నంగా ఉండడం గమనార్హం. స్మార్ట్‌ఫోన్లు, సామా జిక మాధ్యమాలు, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వల్ల పట్టణ ప్రాంత విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు.

మేల్కోకుంటే ముప్పే

ఈ ఫలితాలు విద్యాశాఖ అధికారులకు ఒక హెచ్చరిక. 4,872 మంది విద్యార్థులు ఒక జిల్లాలో ఫెయిల్‌ అయ్యారంటే, అది వ్యవస్థ వైఫల్యం. ఇప్పటికై నా అధికారులు, టీచర్లు పునరాలోచన చేయాలి. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో విద్యాప్రమాణాలు పెంచే దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లేకుంటే విద్యారంగానికి పెద్ద ముప్పు పొంచి ఉందనడంలో సందేహం లేదు.

ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాలు జిల్లాలో విద్యావ్యవస్థలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్నాయి. ప్రత్యేక తరగతులు, వంద రోజుల ప్రణాళిక అంటూ హడావుడి చేసినా ఎక్కువ మంది పిల్లలు మ్యాథ్స్‌, సైన్స్‌లో ఫెయిల్‌ అయ్యారు. అమ్మ భాష తెలుగులోనూ తక్కువ మార్కులు రావడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చదవలేని, రాయలేని స్థితిలో చాలా మంది విద్యార్థులు ఉన్నట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఈ ఫలితాల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే విద్యా ప్రమాణాలు పతనమవుతున్నట్లు స్పష్టమవుతోంది. పదో తరగతి పరీక్షల ఫలితాలపై విశ్లేషణాత్మక కథనం.

హిందీ

213

మంది

తెలుగు

2010

మంది

సోషల్‌

2549

మంది

ఇంగ్లీష్‌

658

మంది

సైన్స్‌

3196

మంది

గణితం

2298

మంది

సబ్జెక్టుల వారీగా ఫెయిల్‌ అయిన విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement