హీరో అంటే విజయ్‌ లాగా ఉండాలి! | - | Sakshi
Sakshi News home page

హీరో అంటే విజయ్‌ లాగా ఉండాలి!

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

నగరి : హీరో అంటే విజయ్‌లాగా ఉండాలని మాజీ మంత్రి ఆర్కేరోజా కొనియాడారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ అత్యధిక సీట్టు సాధించడంపై సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సింగిల్‌గా పోటీచేసి తన స్టార్‌ ఇమేజ్‌ని విజయ్‌ నిరూపించుకున్నారన్నారు. తన సత్తా చాటుకున్నాడని చెప్పారు. ఆయనను నమ్ముకున్న అభిమానులకు, కేడర్‌కు నేడు భరోసా లభించిందన్నారు. మన రాష్ట్రంలోనూ పవర్‌ స్టార్‌ ఉన్నారని, ఆయన సింగిల్‌గా పోటీచేసే దమ్ములేక పాలేరులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అడ్వాన్డ్స్‌ లైఫ్‌ సపోర్ట్‌ శిక్షణ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం ): అత్యవసర వైద్య పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే నైపుణ్యాల పెంపు లక్ష్యంగా చిత్తూరు నగరంలోని అపోలో ఇన్‌న్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఏఐఎంఎస్‌ఆర్‌)లో రెండు రోజుల బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ (బీఎల్‌ఎస్‌), అడ్వాన్డ్స్‌ కార్డియాక్‌ లైఫ్‌ సపోర్ట్‌ (ఏసీఎల్‌ఎస్‌) శిక్షణ కార్యక్రమం సోమవా రం ప్రారంభమైంది. ఏఐఎంఎస్‌ఆర్‌ డీన్‌ డాక్టర్‌ అల్ఫ్రెడ్‌ జెన్‌ అగస్టీన్‌, అకడమిక్స్‌ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ రమ్యా రామకృష్ణన్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి 13 మంది అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఇన్‌స్ట్రక్టర్లు పాల్గొంటున్నట్టు వెల్లడించారు.

వి‘జయహో’!

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): తమిళనాడు ఎన్నికల్లో సినీ నటుడు విజయ్‌ స్థాపించిన టీవీకే పార్టీ విజయం సాధించింది. చిత్తూరు నగరంలో సోమవారం విజయ్‌ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. గాంధీ విగ్రహం కూడలి వద్ద టపాసులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. తమ అభిమాన హీరో విజయ్‌ ముఖ్యమంత్రి కానుండడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

జాతరకు పటిష్ట భద్రత

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలో నిర్వహించే గంగ జాతరకు పటిష్ట భద్రత కల్పిస్తామని డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. సోమవా రం చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న గంగ జాతరపై నిర్వాహకులతో పోలీసు అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement