నియామకాలు.. పదోన్నతులు | - | Sakshi
Sakshi News home page

నియామకాలు.. పదోన్నతులు

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాపరిషత్‌ పరిధిలో సోమవారం నియమాకాలు, ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. సోమవారం జెడ్పీలోని చైర్మన్‌ చాంబర్‌లో ఈ కార్యక్రమంలో కారుణ్య నియమాకం కింద సుమేష్‌, చందుసాయి, జాహ్నవిని నియమించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అదేవిధంగా అటెండర్లుగా పనిచేస్తున్న 12 మంది ఉద్యోగులు మోహన్‌రాజు, కుమారస్వామి, లక్ష్మి, సురేంద్రబాబు, రాధరాణి, గిరిషా, శారద, సుజాత, లక్ష్మణ, ఇందిరమ్మ, లోకేష్‌బాబు, పద్మావతికి రికార్డు అసిస్టెంట్‌లుగా పదోన్నతి ఇచ్చారు. రికార్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 9 మంది ఉద్యోగులు ముజీబర్‌రెహ్మన్‌, గీత, యువరాజ్‌, ప్రమీల, స్వప్న, కృష్ణామూర్తి, ఢిల్లీప్‌కుమార్‌, రామానూజుల, సుధాకర్‌లకు జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి కల్పించారు. వీరికి జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్‌నాయుడులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement