గాలి వాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలి వాన బీభత్సం

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

● నేలవాలిన విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ● రూ.7లక్షల వరకు నష్టం

చిత్తూరు కార్పొరేషన్‌: చిత్తూరు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్‌ శాఖకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ట్రాన్స్‌కో చిత్తూరు అర్బన్‌, రూరల్‌ డివిజన్ల పరిధిలో ఆదివారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. చిత్తూరు, పూతలపట్టు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాలలోని వివిధ చోట్ల కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్‌, లైన్లు నేలవాలాయి. పలు ప్రాంతాల్లో మొక్కలు, చెట్లు లైన్‌ పై పడడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలివానతో మొత్తం దాదాపుగా రూ.7 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు ఈఈలు మునిచంద్ర, సురేష్‌ తెలిపారు. ఈమేరకు 8 మీటర్ల కరెంటు స్తంభాలు 52, 9.1 మీటర్ల స్తంభాలు 36, ట్రాన్స్‌ఫార్మర్లు 27 మరమ్మ తుగు గురైనట్టు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement