రెండు దుకాణాల్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

రెండు దుకాణాల్లో చోరీ

May 4 2026 7:37 AM | Updated on May 4 2026 7:37 AM

శాంతిపురం: మండల కేంద్రమైన శాంతిపురంలోని కుప్పం–పలమనేరు జాతీయ రహ దారి పక్కన ఉన్న మద్యం, పెయింట్స్‌ దుకాణాల్లో శనివారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కుప్పం – పలమనేరు జాతీయ రహదా రి సమీపంలో చికెన్‌ దుకాణాలు ఉన్నాయి. వాటి వెనుక ఒక మద్యం దుకాణం ఉంది. దొంగలు శనివారం రాత్రి దుకాణం వద్దనున్న కెమెరాలను కర్రతో పక్కకు తిప్పి తాళాలు పగులగొట్టి షట్టర్‌ను తెరిచారు. గల్లాపెట్టెలో ఉన్న రూ.లక్షకు పైగా నగదు, మద్యం బాటిళ్లను చోరీ చేశారు. అదేవిధంగా మఠం సమీపంలోని జూనియర్‌ కాలేజీ పక్కన ఉన్న పెయింట్స్‌, హార్డ్‌వేర్‌ షాపులో చోరీకి పాల్పడ్డారు. దుండగులు ముందుగా దుకాణం వద్ద ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం దుకాణంలోకి చొరబడి నగదు, సీసీ కెమెరాల హార్డ్‌ డిస్క్‌లను పట్టుకుపోయారు. బాధితులు రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement