జాగ్రత్తలు అవసరం | - | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలు అవసరం

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

గత ఏడాది కంటే ఈ సంవత్సరం 20 శాతం అధికంగా వడదెబ్బ సోకే ప్రమాదం ఉంది. అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి గంటకొకసారి నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, అంబలి, నిమ్మ రసం తదితర సహజ సిద్ధ ద్రవపదార్థాలను సేవించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లకూడదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే కాటన్‌ దుస్తులు ధరించాలి. సన్‌ స్క్రీన్‌ లోషన్లు, కూలింగ్‌ గ్లాసు, గొడు గు, ఒక లీటరు నీరు వెంట తీసుకువెళ్లాలి. మాంసం, మసాలా, నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోవద్దు. ధూమపానం, మద్యం సేవించరాదు.

– డాక్టర్‌ జ్యోతి కుమార్‌, ఆయుర్వేద వైద్య నిపుణులు, వీజే హాస్పిటల్‌, తిరుపతి

Advertisement
 
Advertisement
Advertisement