జాతీయ స్థాయి పోటీలకు బాలాజీ కవితా సంపుటి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు బాలాజీ కవితా సంపుటి ఎంపిక

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

పలమనేరు: జాతీయ స్థాయిలో నిర్వహించిన వేటూరి వెంకయ్యనాయుడు శకుంతల స్మార క సాహిత్య పురస్కారా ల్లో భాగంగా ఉత్తమ వచనా కవితా సంపుటాల పోటీల్లో పలమనేరు బాలాజీ రచించిన ‘లోపలేదో కదులుతున్నట్టు’ కవితా సంపుటి ఎంపికై ంది. ఈ మేరకు నిర్వాహకులు హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసగౌడ్‌ నుంచి శనివారం సమాచారం అందింది. ఇతర పురస్కారాల్లో భాగంగా జూలకంటి జగన్నాథం రచించిన ఇక కప్పు ఛాయ్‌... నాలుగు మేసేజులు, సుధామురళి రచించిన తడి ఆరని వాక్యాలు, నారాయణరావు రచించిన బతుకొక ఉత్సవం, ప్రత్యేక క్యాటగిరీల్లో మరికొన్ని ఎంపికైనట్టు తెలిపారు. ఇందులో భాగంగా పలమనేరు బాలాజీకి రూ.10 వేల నగదుతోపాటు పురస్కారాన్ని త్వరలో అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

హనీట్రాప్‌ నేరాలపై

అప్రమత్తంగా ఉండాలి

చిత్తూరు అర్బన్‌: సోషల్‌ మీడియా ద్వారా హనీట్రాప్‌ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి హెచ్చరించారు. ఆయన శని వారం విలేకరులతో మాట్లాడుతూ కొంతమంది నకిలీ ప్రొఫైల్స్‌తో స్నేహం చేసి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని తెలిపా రు. తర్వాత ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో అపరిచితులతో ఆన్‌లైన్‌లో స్నేహం చేయవద్దని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూ చించారు. హనీట్రాప్‌కు గురైతే భయపడకుండా 1930 నంబర్‌కు లేదా సమీప పోలీస్‌ స్టేష న్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

సకాలంలో ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు

చిత్తూరు కార్పొరేషన్‌ : సకాలంలో ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మతు చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. శనివారం ఎస్‌ఈ కార్యాలయంలో ఆయన ఎంఆర్‌టీ, నిర్మాణ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై మాట్లాడారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని త్వరతగతిన ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతు చేయించాలన్నారు. సంబంధిత ఎస్‌పీఎంల నందు రోలింగ్‌ స్టాక్‌ను సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. సెప్టెంబర్‌ లోపు మొత్తం పనులు పూర్తి చేసే విధంగా అధికారులు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలన్నారు. వీటి ద్వారా గ్రామాలకు త్రీఫేజ్‌ విద్యు త్‌ సరఫరా వస్తుందన్నారు. ఈఈలు బాబు, భాస్కర్‌నాయుడు పాల్గొన్నారు.

ఆరుగురు నాన్‌ టీచింగ్‌

సిబ్బందికి ప్రమోషన్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తు న్న ఆరుగురు నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి ఉద్యోగోన్నతి లభించింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రికార్డ్‌ అసిస్టెంట్‌ హోదా నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌ హోదా పొందా రు. వారిలో చరణ్‌కుమార్‌ (బీఎస్‌.కణ్ణన్‌), ప్రసాద్‌ (పాపానాయుడుపేట), శ్రీరంజని (పుత్తూరు), శంకరయ్య (కలకడ), రెడ్డెప్ప (నిమ్మనపల్లి), మదన్‌మోహన్‌రెడ్డి (నందవనం) ఉన్నారు. ఉద్యోగోన్నతి పొందిన నాన్‌ టీ చింగ్‌ ఉద్యోగులు త్వరతగతిన కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని అధికారులు ఆదేశించారు.

ఇసుక టిప్పర్లు స్వాధీనం

గుడిపాల: తమిళనాడుకు అక్రమంగా వెళ్తున్న రెండు ఇసుక టిప్పర్లను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శనివారం తెల్లవారుజామున పట్టుకున్నారు. గుడిపాల మండలం నుంచి తమిళనాడుకు రెండు టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో వాటిని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీటిని మైన్స్‌శాఖ వారికి అప్పజెప్పినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement