అకాల వర్షం.. అపార నష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. అపార నష్టం

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

● నేల రాలిన మామిడి, ● కూలిన రేకుల షెడ్లు

● నేల రాలిన మామిడి, ● కూలిన రేకుల షెడ్లు

కార్వేటినగరం: జీడీనెల్లూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం కురిసిన గాలివానతో కూడిన అకాల వర్షాని అపార నష్టం కలిగింది. కలికిరిండ్లు గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి 10 ఎకరాల మామిడి తోటలో సుమారు 15 టన్నుల మామిడి కాకయలు నేలరాలాయి. అదే విధంగా అర్కేవీబీపేట పంచాయతీ ఇందిరా కాలనీకి చెందిన సుబ్రమణ్యం పాల డెయిరీ కోసం ఏర్పాటు చేసిన భారీ రేకుల షెడ్డు కూలిపోయింది. ఆవులు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న కూలీలు అప్రమత్తమై 15 పాడి పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కార్వేటినగరం ఈదురు గాలులకు కొబ్బరి చెట్లు, వెదురు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

బాలుడిపై హత్యాయత్నం

గంగవరం: మండలంలోని కలగటూరులో శుక్రవారం రాత్రి ఒక మహిళ బాలుడిపై హత్యాయత్నానికి పాల్పడింది. బాలుడి తండ్రి జయచంద్రారెడ్డి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. కలగటూరుకు చెందిన జయచంద్రారెడ్డి కుమారుడు వర్శిత్‌(15) శుక్రవారం రాత్రి ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో జయచంద్రారెడ్డి ఇంటి వద్ద లేడు. ఈ విషయాన్ని గ్రహించిన ఇదే గ్రామానికి చెందిన కస్తూరి అనే మహిళ ఇంట్లోకి చొరబడింది. బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయ త్నించింది. చుట్టుపక్కల వారి సమాచారంతో బాలుడి తండ్రి ఇంటికి వెళ్లి చూడగా కుమారుడు చేయి విరిగి కింద పడిపోయి ఉన్నాడు. వెంటనే పలమనేరు ఏరియా ఆస్పత్రికి అక్కడి నుంచి ప్రైవేట్‌ ఆర్థో క్లినిక్‌కు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నాడు. శనివారం పొలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడిపై హత్యాయత్నం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

Advertisement
 
Advertisement
Advertisement