– పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికారులు
చిత్తూరు కలెక్టరేట్ : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఆదివారం నిర్వ హించనున్నారు. ఈ పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీవీకేఎన్ పరీక్ష కేంద్రంలో 456 మంది, లిటిల్ ఫ్లవర్‌లో 384 మంది, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో 220 మంది పరీక్షలు రాయనున్న ట్లు సిటీ కో ఆర్డినేటర్ జీవనజ్యోతి తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నా రు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిబంధనల ప్రకా రం అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని వెల్లడించారు.
క్రీడలతో
ఉజ్వల భవిష్యత్తు
చిత్తూరు కలెక్టరేట్: క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానిబాషా అన్నారు. శనివారం పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సాఫ్ట్‌బాల్ వేసవి శిబిరం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు ముఖ్యమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు శిబిరంలో ఉచిత శిక్షణ ఇస్తారన్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జూన్ 10, 11, 12 తేదీల్లో విశాఖపట్నం (భీమిలి)లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు షణ్ముగం, పీడీ దేవా, రమేష్, లోకేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.


