భాషా సబ్జెక్టుల్లో వ్యాకరణం, లేఖ రచన వంటి అంశాల్లో తప్పులు లేకుండా ఎలా రాయాలో సాక్షి మెటీరియల్ లో వివరించారు. అలాగే పదజాలాన్ని ఎలా పెంచుకోవాలో తెలియజేశారు. దీని వల్ల నేను లాంగ్వేజెస్‌లో సైతం మంచి మార్కులు సాధించాను.
– లాహిద్, 590 మార్కులు,
వరదప్పనాయుడు మున్సిపల్ స్కూల్, చిత్తూరు
సమగ్ర రివిజన్
పరీక్షలకు వారం ముందు భారీ పాఠ్యపుస్త కాలు చదవడం కష్టమవుతుంది. అప్పుడు సాక్షి మెటీరియల్ క్విక్ రివిజన్ గైడ్‌లా పనిచేసింది. ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలను కుదించి ఇవ్వడం వల్ల తక్కువ సమయంలోనే మొత్తం సిలబస్ రివిజన్ చేయగలిగాను. నేను ఈ రోజు టాపర్‌గా నిలిచాను.
– జనని, 591 మార్కులు, కుప్పం బాలికల జెడ్పీ హైస్కూల్


