చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్‌కో ఉమ్మడి జిల్లా స్టోర్స్‌ను శుక్రవారం పీఅండ్‌ఎంఎం సీజీఎం రమణ పరిశీలించారు. స్టోర్స్‌లో ఉన్న పరికరాలు, అవసరమైన పరికరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన పరికరాల వివరాలు నివేదిక పంపించాలని, వాటి కోసం టెండర్లు ఆహ్వానించి సరఫరా చేస్తామ ని తెలిపారు. అంతకు ముందు ఆయన చిత్తూరు అర్బన్ ఈఈ కార్యాలయంలో జరుగుతున్న ఈఆర్వో కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ అమర్‌బాబు, డీఈలు వసంతనాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీ తనిఖీ
పూతలపట్టు(యాదమరి): మండల కేంద్రమైన పూతలపట్టులోని పీహెచ్‌సీని శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. సంజీవిని ప్రాజెక్టు సేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి అందుతున్న చికిత్సలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, సీహెచ్‌వో లక్ష్మీనారాయణ, పీసీ వినీష్, ఫార్మసిస్ట్ కాంచన పాల్గొన్నారు.


