అద్వితీయం! | - | Sakshi
Sakshi News home page

అద్వితీయం!

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

● చిత్తూరు విద్యార్థిని స్టేట్‌ సెకండ్‌

● చిత్తూరు విద్యార్థిని స్టేట్‌ సెకండ్‌

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లా కేంద్రంలోని మిట్టూ రులో ఉన్న ర్యాంకర్స్‌ పాఠశాలలో పదో తరగ తి చదివిన ఎం.అంకితరెడ్డి 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్‌, జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించింది. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు సాధారణ వ్యవసాయ రైతులు. పొలం పనుల్లో కష్టపడుతూనే తమ బిడ్డను ఉన్నత చదువులు చదివించాలని వారు కన్న కలలను ఆ విద్యార్థిని నిజం చేసింది. ఉత్తమ ఫలితాలు సాధించిన ఆ విద్యార్థినిని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ, డీఈవో రాజేంద్రప్రసాద్‌, డీవైఈవో ఇందిరా, ఎంఈవోలు సెల్వరాజ్‌, మోహన్‌, పాఠశాల కరస్పాండెంట్‌ రమణారెడ్డి అభినందించారు. ఆ విద్యార్థిని మాట్లాడుతూ తన తల్లిదండ్రులు ఎండనక, వాననక పొలంలో కష్టపడి చదివించారన్నారు. భవిష్యత్‌లో డాక్టర్‌ కావడమే తన లక్ష్యమని తెలిపారు.

మార్కులే ప్రామాణికం కాదు

చిత్తూరు కలెక్టరేట్‌ : పదవ తరగతి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని డీఈవో రాజేంద్రప్రసాద్‌ సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫలితాలు ఎలా ఉన్నా కుంగిపోకూడదన్నారు. మార్కులు కేవలం ఒక దశ మాత్రమేనని, జీవితాన్ని నిర్ణయించవన్నారు. రీ కౌంటింగ్‌కు ప్రతి సబ్జెక్ట్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు ప్రతి సబ్జెక్ట్‌కు రూ.1000 చొప్పున మే 1 నుంచి 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలను www. bse. ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చన్నారు. అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 25 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు నిర్వహిస్తారని డీఈవో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement