– 8లో
పేకాట క్లబ్బులకు నాని కవచం
చంద్రగిరి ఎమ్మెల్యే నాని సొంత మండలమైన పాకాలలో పేకాట క్లబ్బులను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో మే 3న నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నిర్వహణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌వో మోహన్‌కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణ పై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మూడు విద్యాసంస్థలను నీట్ పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసినట్టు తెలిపారు. మొత్తం 1,060 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో 456, లిటిల్ ప్లవర్ పాఠశాలలో 384, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో 220 మంది విద్యార్థులను కేటాయించినట్లు తెలిపారు. పరీక్ష 3వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఉంటుందన్నారు.
కీలక ఆదేశాలు
సమావేశంలో నీట్ పరీక్ష నిర్వహణపై డీఆర్‌వో కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా తప్పనిసరి అని చెప్పారు. నీట్ పరీక్షకు వచ్చే విద్యార్థులు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను లోపలికి అనుమతించరని స్పష్టం చేశారు. నోడల్ ఆఫీసర్ డా.జీవనజ్యోతి పాల్గొన్నారు.


