రాజకీయ పార్టీల సమీక్షలో కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్ : ఈవీఎంల భద్రతలో ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో ఈవీఎం గోడౌన్‌ను ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నామన్నారు. గోడౌన్‌న్‌లో భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాల స్థితిగతులను తనిఖీ చేసినట్లు తెలిపారు.
జిల్లాలో 15.79 లక్షల మంది ఓటర్లు
జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 15,79,996 మంది ఓటర్లు ఉన్నారన్నారు. మృతులు, బోగస్ ఓటర్లను గుర్తించి తొలగించే ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ఇందులో రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని సహకరించాలని కోరారు. ఈ సమీక్షలో డీఆర్‌వో మోహన్‌కుమార్, పలు గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు ఉదయ్‌కుమార్‌రెడ్డి, సురేంద్ర, అట్లూరి శ్రీనివాసులు, గంగరాజు, పరదేశి పాల్గొన్నారు.


