‘దశ’మారేనా? | - | Sakshi
Sakshi News home page

‘దశ’మారేనా?

Apr 30 2026 7:55 AM | Updated on Apr 30 2026 7:55 AM

● గత ఏడాది పదిలో 24వ స్థానం ● ప్రచారానికే పరిమితమా...సత్తా చాటుతారా? ● నేడే పది ఫలితాల జాతకం!

చిత్తూరు కలెక్టరేట్‌ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. జిల్లా విద్యాశాఖ నెలల తరబడి చేసిన కసరత్తు, విద్యార్థుల కష్టం, టీచర్ల కృషి ఏ మేరకు ఫలించిందో గురువారం ఉదయం 11 గంటలకు తేలనుంది. గత ఏడాది సాధించిన ఫలితాల కంటే మెరుగైన స్థానానికి జిల్లా యంత్రాంగం చేరుకుంటుందా..? లేదా.. షరామామూలేనని చేతులెత్తేస్తుందా.. వేచి చూడాల్సి ఉంది. గత ఏడాది 67.06 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 24వ స్థానంలో నిలిచిన జిల్లా, ఈ సారైనా అగ్రస్థానంలో నిలుస్తుందా లేక ప్రచార ఆర్భాటలకే పరిమితమై అట్టడుగుకు పడిపోతుందా? అన్నది చర్చనీయంశంగా మారింది.

మార్పు కనిపించేనా?

గత ఏడాది సాధించిన 24వ స్థానం సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ప్రతిష్టకు పెద్ద మచ్చగా మిగిలిపోయింది. ఆ అవమానాన్ని తుడిచేయడానికి ఈ విద్యాసంవత్సరం జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో టీచర్ల కొరత వేధిస్తున్నా, మౌలిక వసతులు చేపట్టకపోయినా కేవలం నైట్‌ స్టడీస్‌ పేరుతో హడావిడి చేయడం ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సి ఉంది.

గత ఫలితాలు ఇలా

గురువారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను rerutr. bre.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్‌ (9552300009) నంబర్‌, లీప్‌ మొబైల్‌ యాప్‌, డీజీ లాకర్‌ యాప్‌లో చూసుకునే వెసులుబాటు ఉంది.

ఫలితాలు ఇలా చూసుకోవచ్చు

Advertisement
 
Advertisement
Advertisement