యాదమరి: వైద్య రంగంలో తీసుకువస్తున్న డిజిటల్ సంస్కరణలు ప్రజలకు వరంగా మారనున్నాయని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. మంగళవారం ఆయన సంతగేటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న సౌఖర్యాలపై ఆరాతీశారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న సంజీవిని పథకం ఆవశ్యకతను వివరించారు. ఈ పథకంలో భాగంగా ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రతీ రోగికి ఒక ప్రత్యేకమైన ఆరోగ్య కార్డులను అందజేస్తామని చెప్పారు. ఈ కార్డులో రోగి వైద్య చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉంటుందన్నారు. తద్వా రా రోగులు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా వైద్యులు పాత రిపోర్టులు చూడాల్సిన అవసరం లేదన్నారు. దీంతో తక్షణమే మెరుగైన వైద్యం అందించవచ్చని చెప్పారు. అనంతరం ఆయన ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వైధ్యాధికారులు డా.అనిల్‌కుమార్, జగదీష్, సీహెచ్‌ఓ శ్రీనివాసమూర్తి, వైద్య సహాయకులు సురేంద్రరెడ్డి, నాయకులు అమర్నాథనాయుడు పాల్గొన్నారు.


